Ataveladi


Collection of Ataveladi poems

For rules regarding this metre please see Telugu Padyalu

ఆటవెలది పద్యాలు

గంగ కడగ గలదు ఘన పాప కలుషంబు
కల్ప వృక్షమిచ్చు కామితంబు
దయను దీర్చు గురుడు దైన్యంబు పాపంబు
తలప సత్యము గురు దాసు మాట

Gaṅga kaḍaga galadu ghana pāpa kaluṣambu
kalpa vr̥kṣamiccu kāmitambu
dayanu dīrcu guruḍu dain'yambu pāpambu
talapa satyamu guru dāsu māṭa



మూడు మూర్తులలిగి ముప్పుగా మారినా
గురుని కృపను మేలు కూడ గలదు
మీరి గురునియాన మెలుగరా మువ్వురు
తలప సత్యము గురు దాసు మాట

mūḍu mūrtulaligi muppugā mārinā
guruni kr̥panu mēlu kūḍa galadu
mīri guruniyāna melugarā muvvuru
talapa satyamu guru dāsu māṭa



ఆదిదేవుడైయ్యు అవతారమును దాల్చి
ధర్మమాచరించి ధరణి జనుల
కు సరి నడత జూపె గురుడేను రాముడు
తలప సత్యము గురు దాసు మాట

ādidēvuḍaiyyu avatāramunu dālci
dharmamācarin̄ci dharaṇi janula
ku sari naḍata jūpe guruḍēnu rāmuḍu
talapa satyamu guru dāsu māṭa



వాంఛలెల్ల వెయ్యి పాములై చుట్టగా
కోయలేని వాడ కోరి పిలువ
గరుడ గమన వేగ కావంగ దిక్కువు
తలప సత్యము గురుదాసు మాట

vān̄chalella veyyi pāmulai cuṭṭagā
kōyalēni vāḍa kōri piluva
garuḍa gamana vēga kāvaṅga dikkuvu
talapa satyamu gurudāsu māṭa



సత్య నిష్ఠ తోడ సాగింప జీవనం
నిర్ణయించి చేర నీతి మతులు
మనము పదిలముగను మాధవుడేయుంచు
తలప సత్యము గురుదాసు మాట

satya niṣṭha tōḍa sāgimpa jīvanaṁ
nirṇayin̄ci cēra nīti matulu
manamu padilamuganu mādhavuḍēyun̄cu
talapa satyamu gurudāsu māṭa

కట్టి కుదుపు పూర్వ కర్మంబు వీడక
ఎట్టి వారికైన ఇదియె రీతి
పట్టు గురుని పాద పద్మంబు మేలగు
తలప సత్యము గురు దాసు మాట

Kaṭṭi kudupu pūrva karmambu vīḍaka
eṭṭi vārikaina idiye rīti
paṭṭu guruni pāda padmambu mēlagu
talapa satyamu guru dāsu māṭa

సాయి నాథుడనగ సాక్షాత్తు దత్తుడే
మనల కావ ఇటుల మరల వెలిసె
దత్త సాయి గొల్వ దరిరాదె మోక్షంబు
తలప సత్యము గురుదాసు మాట

sāyi nāthuḍanaga sākṣāttu dattuḍē 
manala kāva iṭula marala velise 
datta sāyi golva darirāde mōkṣambu 

talapa satyamu gurudāsu māṭa


No comments:

Post a Comment