Thursday, July 18, 2013

రాగం: ఇందోళం
తాళం: ఆది

గణపతిరవతు మాం
గౌరీ నందన గజాననో  శ్రీ

మణి గణ శోభిత మహేంద్రాది
మకుట ప్రకాశ విరాజిత చరణో॥

ఫణి శయన పంకజాసన
ఫణి భూషణ వినుత చరితో ॥
అణిమాది సిద్ధి వినాయకో
ఆగమ విదిత శ్రీ గురుదాస నుతో  ॥


गणपतिरवतु माम्
गौरी नन्दन गजाननो श्री ||

मणि गण शोभित महेन्द्रादी
मकुट प्रकाश विराजित चरणो ||

फणि शयन पङ्कजासन
फणि भूषण विनुत चरितो  ||
अणिमादि सिद्धि विनायको
आगम विदित श्री गुरुदास नूतो  ||

Friday, April 19, 2013


ఆదిదేవుడైయ్యు అవతారమును దాల్చి
ధర్మమాచరించి ధరణి జనుల
కు సరి నడత జూపె గురుడేను రాముడు
తలప సత్యము గురు దాసు మాట

Tuesday, April 9, 2013

సమస్య: "పరమ శివుని జూచి పార్వతి వగచెన్"

పూరణ:

మాయవలన అసురుడు సతి
నీయమని  వరమును గోర నిడిభక్తునికై
ఛాయను బోలు తననుఎడ
బాయు పరమ శివుని జూచి పార్వతి వగచెన్  

Monday, April 8, 2013


మూడు మూర్తులలిగి ముప్పుగా మారినా
గురుని కృపను మేలు కూడ గలదు
మీరి గురునియాన మెలుగరా మువ్వురు
తలప సత్యము గురు దాసు మాట


గంగ కడగ గలదు ఘన పాప కలుషంబు
కల్ప వృక్షమిచ్చు కామితంబు
దయను దీర్చు గురుడు దైన్యంబు పాపంబు
తలప సత్యము గురు దాసు మాట

Sunday, April 7, 2013

అవివేకము కూడి జనులు
చవిచూడగ అల్ప సుఖము జననములొందన్
సవివేకము కలిగింపగ
అవతారములెత్తె చూడుమది గురుదాసా  

Wednesday, April 3, 2013

గురుడే యట పద్మభవుడు
గురుడే ఈ జగము గాచు గోవిందుండున్
గురుడే ఆ పరమశివుడు
గురుడే సర్వము గురుతుగ గురి గురుదాసా  

Wednesday, March 20, 2013


సమస్య: "శవ దర్శనమున జననము సార్ధకమయ్యెన్"

పూరణ:

జవముననేగి నరవరుల
వివరము నెరుగగ భువిసుర వేషమునున్నా  
పవనాత్మజునకపుడు కే
శవ దర్శనమున జననము సార్ధకమయ్యెన్
అలవోకగ గురు కృపచే 
తలపోయగ తెలుగు వేల్పు తరువిడు ఛాయన్ 
నలుగురు తెలియగ నుడివెద  
కలుషాపహ సచ్చరితమికను గురుదాసా 

Wednesday, February 20, 2013

ఏ రీతి ఇల మలచెదవో
ఏమో ఎలో ఎరుగలేనయ్య

సరి జేసి దయ సమకూర్చి
సర్వము నీవని నమ్మిన నన్ను

జనని జనకుల దీవెనను జననార్థమునిడు  గురు కృపను
శ్రీనాయక పొందిన ఎదను శ్రీగురుదాసుకు మేలగు విధమున 

Tuesday, February 12, 2013


శ్రీ భ్రమరామ్బామ్ భజరే సతతం | శ్రీ భారతి పార్వతి స్వరూపాం ||

త్రిభువన పాలినీం శూలినీం | త్రిపురారి మల్లికార్జున ప్రణయినీమ్ ||
అభిష్ట వరదాయినీం సుందరీం | అఖిల లోక జననీం ఈశ్వరీం ||

శ్రీశైల శిఖర వాసినీం సుహాసినీం | శాప తాప పాప నివారిణీమ్ ||
శ్రీశ సోదరీం సతోదరీం | శీనందనాది శ్రితరక్షాకరీం ||
అశేష సుఖదాం గిరిజాం | ఆగమనుత గుణ నిలయాం ||
సుశీలాం సువర్ణ చేలాం | శ్రీ గురుదాస మానసాలయాం ||


श्री भ्रमराम्बाम् भजरे सततम् | श्री भारती पार्वती स्वरूपाम् ||

त्रिभुवन पालिनीम् शूलिनीम् | त्रिपुरारि मल्लिकार्जुन  प्रणयिनीम् ||
अभीष्ट वरदायिनीम् सुन्दरीम् | अखिल लोक जननीम् ईश्वरीम् ||

श्रीशैल शिखर वासिनीम् सुहासिनीम् | शाप ताप पाप निवारिणीम् ||
श्रीश सोदारीम् सतोदरीम् | श्री नंदनादि श्रित रक्षाकरीम् ||
अशेष सुखदाम् गिरिजाम् ।  आगम नुत गुण निलयाम् ||
सुशीलाम् सुवर्ण चेलाम् | श्री गुरुदास मानसालयाम् ||

గోపాల బాలం భజరే మానసా  |
గోపి జన బృందానందం గోవిందం ముకుందం సదా ||

తాపార్తి నివారణ చతురం |
తాపస ప్రియం తరణి విధు నయనం ||

దేవ రాజ నుత మహాప్రతాపం | దివ్య నీలాబ్ర రూపం ||
దివిజ భూజ నిభ వరప్రదాతం | దీన రక్షకం వినుత విధాతం ||
గోవర్ధన ధృత చిద్విలాసం |  గోకులవాసం పాపనాశం ||
శ్రీవనిత వరం శ్రీవదనం |  శ్రీగురుదాసార్చిత మోహనం ||



गोपाल बालम् भजरे मानस
गोपिजनबृंदानन्दम् गोविन्दम् मुकुंदम् सदा

तापार्ति निवारण चतुरम्
तापस प्रियम् तरणि विधु नयनम्

देवराज नुत महाप्रतापम् | दिव्य निलाब्र रूपम् ||
दिविज भूज निभ वरप्रदातम् | दीनरक्षकम् विनुत विधातम् ||
गोवर्धन धृत चिद्विलासम् | गोकुल वासम् पापनाशम् ||
श्रीवनिता वरम् श्री वादनम् | श्री गुरुदासार्चित मोहनम् ||



నీ చరణములే నమ్మితి
నీచ మార్గముల విడనాడి

నాచేతనేమున్నది
నీచిత్తముననుసరించు జగమున

నాడే నీ దాసుడనైతినే
నేడు నీదయగానరాదాయే నీ
తోడిదే  జీవము తోయజాక్షా! 
తోడువై నిలువుమా! శ్రీగురుదాసరక్షా!
మధురపురమును ఏలు మాయమ్మ మీనాక్షమ్మ రక్షనీవమ్మ

మధుసూదన సోదరి అంబ ముజ్జమ్బుల అమ్మలకు అమ్మ

వేదన తీర్పవేవేగమే వేదనాయకి వెడలవమ్మ
మోదము శ్రీగురుదాసులకెపుడు మరువకనిమ్మ తరలిరమ్మ


శ్రీ ముక్తినాథం భజేహం
శ్రీ ముక్తి దాయకం శ్రీకరం అనిశం

కామజనకం కామారి వంద్యం కామితఫలదం కామవిదూరం
కమలనాభం కమాలాసనాది నుతం కమలనయనం కమల పతిం

శీతల హిమవత్ క్షేత్ర వాసం శతాధిక శ్రీక్షేత్ర ఫలదం
శీత కిరణనిభ వదనం శీశం శతకోటి భానుతేజం
పూత గంధకి తీర నివాసం పీతాంబరధర  శ్రీనివాసం
సతతం శ్రీగురుదాసార్చితం సాలగ్రామధరం శ్రీధరం


श्रीमुक्तिनाथं भजेहं
श्रीमुक्तिदायकं श्रीकरं अनिशं

कामजनकं कामारिवन्द्यं कामितफलदं कामविदूरं
कमलनाभं कमलासनादीनुतं कमलनयनं कमलपतिं

शीतलहिमवत्क्षेत्रवासं शताधिकश्रीक्षेत्रफलदं
शीतकिरणनिभवदनं श्रीशं शतकोटीभानुतेजं
पूतगन्धकीतीरनिवासं पीताम्बरधरश्रीनिवासं
सततंश्रीगुरुदासार्चितं सालग्रामधरं श्रीधरं
ఏది సౌఖ్యము రామా! శ్రీ రామా! ఏది సత్యమో నిత్యమో చెప్పుమా!

నాది నాది అను నరులకునిలలో
నీ ధ్యానము వినా నిజముగ నిరతము

షడ్రసోపేతమగు భోజన భక్షణమా!
సురవరులు మెచ్చు సుమధుర పానమా!
షడ్రిపు వర్గములనణగార్చి బ్రోచు
శ్రీ గురుదాస నుత సంగతి వేడుకలా!